రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగి ఐదేళ్లైన సందర్భంగా అమరావతి రైతులు, మహిళలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెం వరకు వివిధ గ్రామాల నుంచి ర్యాలీలు నిర్వహించి పుణ్యస్థలి వద్ద సర్వమత ప్రార్థనలు చేశారు. తుళ్లూరు, రాయపూడి, మందడం, గుంటూరు నుంచి వేర్వేరుగా పాదయాత్రలు నిర్వహించారు. జై అమరావతి-సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినదించారు. కేంద్ర పరిధిలోకి వచ్చే రాజధాని అంశంపై మోదీ చొరవ తీసుకొని అమరావతినే రాజధానిగా కొనసాగేటట్లు చూడాలని కోరారు.
మహా పాదయాత్ర
అమరావతి నిర్మాణానికి భూమిపూజ చేసి ఐదేళ్లు పూర్తైన సందర్భంగా రాజధాని పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మహా పాదయాత్ర నిర్వహించారు. మంగళగిరి, తాడేపల్లి మండలంలోని రాజధాని గ్రామాల రైతులు మందడం నుంచి, తుళ్లూరు మండలంలో రాజధాని గ్రామాల రైతులు.. రాయపూడి నుంచి ఉద్ధండరాయునిపాలెం వరకు మహా పాదయాత్ర నిర్వహించారు. మహిళలు దారి పొడవునా జై అమరావతి నినాదాలు చేస్తూ నిరనస తెలిపారు. రాయపూడి, వెలగపూడి, ఐనవోలు గ్రామాల రైతులు ప్రభలతో ఆందోళన వ్యక్తం చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రాష్ట్ర హిందూమహాసభ ఆధ్వర్యంలో ఉద్ధండరాయునిపాలెంలో మహారుద్ర యాగం చేశారు.
ఇదీచదవండి
రాజధాని కోసం భూములిచ్చాం.. మమ్మల్ని మోసం చేయవద్దు: రైతులు