MMTS Trains Cancelled: నిర్వహణ సమస్యలు తలెత్తడంతో.. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో వివిధ మార్గాల్లో రాకపోకలు సాగించే పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఈనెల 3వ తేదీన 34 సర్వీసులను రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. లింగంపల్లి-హైదరాబాద్ మార్గంలో 9 సర్వీసులు, హైదరాబాద్-లింగంపల్లి మార్గంలో 9 సర్వీసులు, ఫలక్‌నుమా-లింగంపల్లి మార్గంలో 7 సర్వీసులు, లింగంపల్లి-ఫలక్‌నుమా మార్గంలో 7 సర్వీసులు, సికింద్రాబాద్-లింగంపల్లి మార్గంలో ఒక సర్వీసు, లింగంపల్లి-సికింద్రాబాద్ మార్గంలో ఒక సర్వీసును రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు.
రేపు హైదరాబాద్లో.. ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు..! - హైదరాబాద్ తాజా వార్తలు
MMTS Trains Cancelled: తెలంగాణలోని హైదరాబాద్ జంట నగరాల్లో తిరిగే పలు ఎంఎంటీఎస్ సర్వీసులను రేపు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నిర్వహణ సమస్యలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు