ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వెల్లంపల్లి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి: మంతెన - మంత్రి వెల్లంపల్లిపై ఎమ్మెల్సీ మంతెన కామెంట్స్

"పేదల అభ్యున్నతి కోసం 14 లక్షల కోట్లు విలువ చేసే ఆస్తులను దానం చేసిన అశోక్ గజపతిరాజును పట్టుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం మంత్రి వెల్లంపల్లి అహంకారానికి నిదర్శం" అని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు విమర్శించారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని హెచ్చరించారు.

వెల్లంపల్లి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి: మంతెన
వెల్లంపల్లి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి: మంతెన

By

Published : Jan 3, 2021, 1:47 PM IST

తెదేపా అధినేత చంద్రబాబు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు డిమాండ్‌ చేశారు. తెదేపా కార్యకర్తలు గుడిలో కొట్టిన కొబ్బరి చిప్పలు ఏరుకోవడానికి వెల్లంపల్లి రామతీర్థం వెళ్తున్నాడని విమర్శించారు

భూ భక్షుకుడైన వెల్లంపల్లి... భూదానం చేసిన అశోక్ గజపతిరాజును ఏకవచనంతో మాట్లాడడాన్ని తప్పుబట్టారు. 19 నెలలుగా రాష్ట్రంలో 125 దేవాలయాలపై దాడులు జరిగితే ఒక్కరిని కూడా ఎందుకు పట్టుకోలేదని నిలదీశారు. వెల్లంపల్లి తన అసమర్థతకు మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. మంత్రి అయ్యాక వేలాది ఎకరాల మాన్యం భూములు అన్యాక్రాంతం చేశారని ఆరోపించారు. దుర్గగుడిలో వెండి సింహాలు మంత్రి కనుసనల్లోనే మాయమయ్యాయని మంతెన ఆరోపించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details