ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇసుక అక్రమాలు నిరూపిస్తే.. మంత్రి పదవికి అవంతి రాజీనామా చేస్తారా! - కొడాలి నానిపై ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు విమర్శలు

ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే వైకాపా నేతలు తెదేపాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు మండిపడ్డారు.

మంతెన సత్యనారాయణ రాజు

By

Published : Nov 17, 2019, 1:50 PM IST

మంత్రులు కొడాలి నాని, అవంతి శ్రీనివాస్​లు వీధి రౌడీల్లా వ్యహరిస్తున్నారని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే తెలుగుదేశం పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 'వైకాపా నాయకులకు మూటలు.. ప్రజలకు వాతల్లా' ఆరు నెలల పాలన ఉందని మండిపడ్డారు. ఇసుక కొరతతో లక్షల మంది కార్మికులు రోడ్డున పడితే.. ఎక్కడా అక్రమాలు జరగలేదని మంత్రి అవంతి దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఇసుక అక్రమాలు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమా అని ప్రశ్నించారు. వీరిని ప్రజలు ఎన్నటికీ క్షమించరన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details