దొంగే.. దొంగా దొంగా అన్నట్లుగా ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి వెలంపల్లి వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ ఎద్దేవా చేశారు. అనవసరంగా అశోక్ గజపతిరాజుపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెయిల్పై బయట తిరుగుతున్న విజయసాయిరెడ్డి.. ఉత్తరాంధ్రలో వేలకోట్ల భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని మంతెన సత్యనారాయణ ఆరోపించారు. విజయవాడ కనకదుర్గమ్మ గుడిని నిలువునా దోచేసిన చరిత్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుది అని మండిపడ్డారు. వీరు అశోక్ గజపతిరాజుకు అవినీతి మకిలీ అంటించాలని చూడటం నిప్పుకు చెదపట్టిందని చెప్పే ప్రయత్నమేనని స్పష్టం చేశారు.
manthena sathyanarayana : దొంగే... దొంగా దొంగా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు: మంతెన సత్యనారాయణ - ఎంపీ విజయసాయిరెడ్డి
ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుపై ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అశోక్ గజపతిరాజుకు అవినీతి మరక అంటించాలని చూడటం దారుణమని అన్నారు.
మ్మెల్సీ మంతెన సత్యనారాయణ