ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'విద్యార్థుల ప్రాణాలు పోయినా.. మీ పంతం నెగ్గాల్సిందేనా?' - ఎమ్మెల్సీ మంతెన న్యూస్

ముఖ్యమంత్రి జగన్ తన అహాన్ని వీడి విద్యార్థుల ప్రాణాల గురించి ఆలోచన చేయాలని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు వ్యాఖ్యానించారు. కరోనా ఉద్ధృతి దృష్ట్యా పది, ఇంటర్ పరీక్షల నిర్వహణ సరికాదని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నా.. జగన్ మొండిగా వ్యవహరిస్తున్నారంటూ.. ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

mlc mantena on tenth exams
విద్యార్థుల ప్రాణాలు పోయినా..మీ పంతం నెగ్గాల్సిందేనా ?

By

Published : May 1, 2021, 6:39 PM IST

మంచెన పత్రికా ప్రకటన

విద్యార్థుల ప్రాణాలు పోయినా.. తన పంతం నెగ్గించుకోవాలనే ధోరణితో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు ధ్వజమెత్తారు. సీఎం స్థాయిలో ప్రజా క్షేమానికి పాటుపడకుండా ప్రజల ప్రాణాలు హరించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

కరోనా ఉద్ధృతి దృష్ట్యా పది, ఇంటర్ పరీక్షల నిర్వహణ సరికాదని ప్రతి ఒక్కరూ చెబుతున్నా.. జగన్ మొండి వైఖరి వీడడం లేదంటూ.. ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తన అహాన్ని వీడి విద్యార్థుల ప్రాణాలు గురించి ఆలోచన చేయాలన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పరీక్షలు బహిష్కరించక ముందే వాయిదా వేయటం లేదా రద్దు చేసి జగన్ తన గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details