ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'మహిళలపై దాడులు.. ప్రభుత్వ వైఫల్యం కాదా?'

By

Published : Aug 18, 2021, 11:31 AM IST

ఎస్సీ యువతి కుటుంబానికి అన్యాయం జరిగితే నోరు మెదపని మంత్రులు.. సీఎం జగన్​ను విమర్శిస్తే మాత్రం ప్రతి విమర్శలు చేయడం సిగ్గుచేటు.. అని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు మండిపడ్డారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మాట్లాడిన దాంట్లో తప్పేముందో చెప్పాలని మంత్రులను నిలదీశారు.

mlc mantena on ministers
mlc mantena on ministers

ఎస్సీ యువతి రమ్య దారుణ హత్యకు గురైందని రాష్ట్రమంతా బాధపడుతుంటే.. మంత్రులు అవంతి శ్రీనివాస్, కొడాలి నాని మాత్రం జగన్ గురించి బాధపడటం సిగ్గుచేటని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు మండిపడ్డారు. వైకాపా వైఖరితో రమ్య ఆత్మ ఘోషిస్తోందని అన్నారు. ఎస్సీ యువతి కుటుంబానికి అన్యాయం జరిగితే నోరుమెదపని వైకాపా నేతలు‎ ముఖ్యమంత్రి జగన్​ను లోకేశ్ విమర్శించారని బయటకొచ్చి మాట్లాడటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. మంత్రి పదవులు పోకుండా కాపాడుకునేందుకు కొడాలి నాని, అవంతి తమ నోళ్లు పోగొట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు.

ఒలంపిక్స్​లో బూతుల పోటీలు పెడితే కాంస్యం కొడాలి నానికి, రజతం అవంతి శ్రీనివాస్​లకు వస్తుందని ఎద్దేవా చేశారు. లోకేశ్ మాట్లాడిన దాంట్లో తప్పేంటో వైకాపా నేతలు చెప్పాలన్నారు. పట్టపగలు నడిరోడ్డుపై మహిళలపై హత్యలు, దాడులు జరుగుతున్నాయంటే అసమర్ధ ప్రభుత్వ వైఫల్యం కాదా? అని నిలదీశారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి న్యాయం చేయకపోగా.. న్యాయం చేయమని కోరిన తెదేపా నేతలపై కేసులు పెట్టడం దుర్మార్గమని విమర్శించారు. అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయడంతో పాటు రమ్య కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details