బడుగు బలహీన వర్గాల వారిని ఆర్థికంగా ఆదుకోవడమే సీఎం జగన్ లక్ష్యమని వైకాపా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. 17 నెలల పాలనలో బీసీలు, బడుగుల కోసం అనేక చట్టాలు తీసుకువచ్చి సమస్యలను పరిష్కరించారన్నారు. 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి అర్హులైన వారిని ఛైర్మన్లు, డైరెక్టర్లుగా నియమించారన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా సీఎం చర్యలు తీసుకుంటున్నారన్నారు.
వివిధ సంక్షేమ పథకాల అమలు ద్వారా 4 లక్షల 39 వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.737 కోట్లు జమ చేశామన్నారు. క్యాలెండర్ ప్రకారం నిర్ణీత సమయంలో సంక్షేమ పథకాలను అమలుచేస్తోన్న ఏకైక రాష్ట్రం ఏపీనే అన్నారు. గత ప్రభుత్వంలో మోసపోయిన బీసీలు, బడుగు బలహీన వర్గాల ప్రజలంతా వైకాపాకు మద్దతుగా ఉన్నారన్నారు.