వైకాపా నుంచి రాష్ట్రాన్ని కాపాడేది తెదేపానేనని ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అన్నారు. వైకాపా 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి, 2014లో ఎందుకు ఘోరంగా ఓడిపోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. మార్పు అనేది ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేమని అభిప్రాయపడ్డారు. తాడిపత్రిలో వైకాపా ఎమ్మెల్యే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి సవాల్ విసిరారు. అప్పుడే నిజమైన గెలుపుగా ఒప్పకుంటామని అన్నారు.
'వైకాపాది నిజమైన గెలుపే అయితే.. తాడిపత్రి ఎమ్మెల్యే రాజీనామా చేసి గెలవాలి' - సీఎం జగన్‌పై టీడీపీ నేతల కామెంట్స్
వైకాపా దుర్మార్గాలకు, దుశ్చర్యలకు అడ్డుకట్టవేసి, రాష్ట్రాన్ని జగన్ బారినుంచి కాపాడేది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి స్పష్టం చేశారు. వాపును చూసి.. గెలుపని వైకాపా అనుకుంటోందని విమర్శించారు.
వైకాపాది నిజమైన గెలుపే అయితే.. లై డిటెక్టర్ టెస్ట్‌కు సిద్ధమా?: దీపక్ రెడ్డి
Last Updated : Mar 16, 2021, 6:56 AM IST