తేదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వైకాపా, భాజపా చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. రాష్ట్ర వినాశనానికే వైకాపా పాటుపడుతోందని వ్యాక్యానించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకు తెదేపా ప్రయత్నిస్తుంటే.. అందుకు విరుద్దంగా వైకాపా నేతలు నడుచుకుంటున్నారని అన్నారు.
'వైకాపా, భాజపా చీకటి ఒప్పందంతో పరస్పరం సహకరించుకుంటూ, ప్రజలను మోసగిస్తున్నాయి. మంత్రులు.. తిట్లు, దూషణలు, అసత్యాలు, ఆరోపణలకే పరిమితమయ్యారు. ఏపీ భవిష్యత్‌ను అమ్మెసేందుకు వైకాపా సిద్ధపడింది. జగన్ అధికారంలోకి వచ్చేందుకు సహకరించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం రూ.లక్షా 50 వేలకోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని ధారాధత్తం చేశారు. పొరుగురాష్ట్రాల కోసం పోలవరం నిలిపేసి రైతులకు రూ.50వేల కోట్ల నష్టం చేకూర్చారు. రాష్ట్రచరిత్రలో ఎన్నడూలేని విధంగా రూ.లక్షా57వేల కోట్ల అప్పు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది. ప్రజలకు పనికిరాని ఇసుక, మద్యం పాలసీలతో కోట్లు దండుకుంటోంది. తెదేపా ప్రభుత్వం అమలుచేసిన 36సంక్షేమ పథకాలను రద్దు చేసి ప్రజలను మోసగిస్తూ, వివిధఛార్జీలు, పన్నుల రూపంలో దోపిడీ చేస్తున్నారు.' అని దీపక్‌రెడ్డి ధ్వజమెత్తారు.