పులివెందులలో రాసిన రాజ్యాంగం ప్రకారం ముందుకెళ్దామో.. లేదో నిర్ణయించుకోవాలని ప్రజలకు ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి సూచించారు.
'ఏ రాజ్యాంగం కావాలో నిర్ణయించుకునే సదావకాశం' - ఏపీలో పంచాయతీ ఎన్నికల వివాదం న్యూస్
పంచాయతీ ఎన్నికల్లో భారతదేశ రాజ్యాంగం ప్రకారం ముందుకెళ్దామా? లేక పులివెందులలో రాసిన రాజ్యాంగం అనుసరిద్దామా? అనేది ప్రజలు నిర్ణయించుకోవాలని తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి పిలుపునిచ్చారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రభుత్వం తుంగలోతొక్కి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసేందుకు యత్నిస్తోందని దుయ్యబట్టారు.
'గణతంత్ర దినోత్సవం జరుపుకొంటున్న తరుణంలో ప్రజలకు ఏ రాజ్యాంగం కావాలో నిర్ణయించుకునే సదావకాశం లభించింది. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రభుత్వం తుంగలో తొక్కి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసేందుకు యత్నిస్తోంది. భారత రాజ్యాంగం ప్రకారం పంచాయతీ ఎన్నికలు జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. అధికారులు సైతం రెండు వర్గాలుగా చీలి వ్యవహరిస్తుండటం బాధాకరం. రాజ్యాంగాన్ని కాపాడుకుందామో.. లేక దాసోహమందామో.. ప్రజలు ఆలోచన చేయాలి. హైకోర్టు తీర్పు అమల్లో ఉన్నందున దానికి కట్టుబడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనా, అధికారులపైనా ఉంది. లేదంటే కోర్టు ధిక్కరణగానే పరిగణించాలి.' అని దీపక్ రెడ్డి హెచ్చరించారు.