రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై వైకాపా ప్రభుత్వం తప్పుడు కథనాలు ప్రచారం చేయిస్తోందని ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి విమర్శించారు. రమేశ్ కుమార్‌ను తమ అదుపాజ్ఞల్లో ఉంచుకొని తామనుకున్నది నెరవేర్చుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ఏం చేసైనా సరే, స్థానిక ఎన్నికల్లో గెలవాలని వైకాపా ప్రయత్నిస్తోందంటూ మండిపడ్డారు.
ఇప్పటికే ఓట్ల తొలగింపు, పంచాయతీలను మున్సిపాలిటీల్లో కలపడం, నామినేషన్లు వేసేవారిని అడ్డుకోవడం, ప్రతిపక్ష అభ్యర్థులను బెదిరించడం, తప్పుడు కారణాలతో నామినేషన్లు తిరస్కరించడం, ప్రలోభాలకు గురిచేయడం, దాడికి పాల్పడటం, అక్రమ కేసులు పెట్టడం వంటివి చేశారని ధ్వజమెత్తారు. రక్షకులుగా వ్యవహరించాల్సిన అధికారులే ప్రజలపట్ల భక్షకులుగా మారడం దారుణమని దుయ్యబట్టారు. పార్టీలకు అతీతంగా వ్యవస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
గత కొన్ని రోజులుగా కొన్ని వార్తా పత్రికలు, ఛానళ్లలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై తప్పుడు వార్తలు ప్రసారమవుతున్నాయి. వీటి వెనుక ఎవరున్నారో ప్రజలందరికీ తెలుసు. ఇలాంటి వార్తలతో వైకాపా ప్రభుత్వం ఆయన్ను భయభ్రాంతులకు గురిచేసి స్థానిక ఎన్నికల ప్రక్రియను సజావుగా సాగనివ్వకూడదని చూస్తోంది. ఏం చేసైనా సరే ఈ ఎన్నికల్లో గెలవాలని అనుకుంటోంది'-- దీపక్ రెడ్డి, ఎమ్మెల్సీ