ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పార్టీ పేరులో ఉన్న 3 వర్గాలకు కూడా న్యాయం చేయలేకపోతున్నారు' - సీఎం జగన్​పై ఎమ్మెల్సీ దీపక్​రెడ్డి కామెంట్స్

వైకాపా పేరులో ఉన్న మూడు వర్గాలకు కూడా జగన్ న్యాయం చేయలేకపోతున్నారని ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దుయ్యబట్టారు. శ్రామికుల జీవితాలను దోచుకుంటున్నారని విమర్శించారు.

'పార్టీ పేరులో ఉన్న మూడు వర్గాలకు కూడా న్యాయం చేయలేకపోతున్నారు'
'పార్టీ పేరులో ఉన్న మూడు వర్గాలకు కూడా న్యాయం చేయలేకపోతున్నారు'

By

Published : Nov 23, 2020, 2:04 PM IST

'పార్టీ పేరులోని యువజనుల పరిస్థితి భవిష్యత్తు లేకుండా పోయింది. శ్రామికుల జీవితాలను దోచుకుంటున్నారు. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉంది. రాష్ట్ర రంగు - నీలం, భాష - బూతులు, వాహనం - జేసీబీ, హాబీ - కూల్చివేత, క్రీడ - రాక్షసానందం, రాజ్యాంగం - రాజారెడ్డి రాజ్యంగం, పాలన విధానం - అక్రమ కేసులు - జైళ్లు, సిద్ధాంతం - రాజకీయ ఉగ్రవాదమని ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు. ఏనుగుల గుంపు గ్రామాలపై పడి తొక్కుకుంటూ పోయినట్లు వైకాపా ఎమ్మెల్యేలు ప్రజలపై పడి పొగరు, అహంకారంతో విచ్చలవిడి దోపిడీ చేస్తున్నారు.' అని ఎమ్మెల్సీ దీపక్​రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

చంద్రబాబుపై వ్యతిరేకత లేకపోయినా ఒక్క అవకాశం ఇచ్చి చూద్దామనే లాటరీలో వైకాపా గెలిచి అధికారం చేపట్టిందని దీపక్​రెడ్డి చెప్పారు. పాదయాత్రలో 400 హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక 34పైగా పథకాలు రద్దు చేశారని ఆరోపించారు. ఎన్నికల ముందే ఈ మాట చెప్పి ఉంటే ప్రజలు ఆ ఒక్క అవకాశం ఇచ్చి ఉండేవారు కాదన్నారు. ఓటేసి మోసపోయిన ప్రజలంతా బయటకొచ్చి నిలదీయాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details