నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఈసీగా మళ్లీ నియామకం కావటంపై మంత్రి కొడాలి నాని బూతులు తిట్టడం దారుణమని ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి వ్యాఖ్యానించారు. జడ్జిల మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు కేసులు పెట్టారని గుర్తుచేసిన అయన... ఇప్పుడు ఎన్నికల కమిషనర్ హోదా జడ్జితో సమానమన్నారు. మంత్రులు ఆ విధంగా దుర్బాషలాడినప్పుడు ఎందుకు వాళ్ల మీద కేసులు పెట్టలేదని నిలదీశారు.
'మంత్రులు ఆ విధంగా దుర్బాషలాడటం సరికాదు'
ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను తిరిగి నియమించడంపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి తప్పుబట్టారు. మంత్రులు ఆ విధంగా దుర్బాషలాడటం సరికాదన్నారు.
'మంత్రులు ఆ విధంగా దుర్బాషలాడటం సరికాదు'
నిమ్మగడ్డ మీద ఎవరెవరూ ఏం మాట్లాడారో మొత్తం లిస్ట్ చేసి కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల సమయంలో జరిగిన అక్రమాలపై ఎన్నికల కమిషనర్ చర్యలు తీసుకోవాలని సూచించారు. కోర్టులు ఏ ఆర్డర్లు ఇచ్చినా ఏమీ కాదని వైకాపా నాయకులు మాట్లాడుతున్నారన్న దీపక్ రెడ్డి... వైకాపా నాయకులకు ప్రజాస్వామ్య విధానం, రాజ్యాంగం అంటే లెక్కలేదని మండిపడ్డారు.