ప్రభుత్వం చేసే తప్పులపై మరిన్ని కేసులు వేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెదేపా ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి స్పష్టంచేశారు. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడినందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించామని తెలిపారు. కార్యదర్శి బాలకృష్ణమాచార్యులతోపాటు సీఎస్, ఇతర ప్రభుత్వ పెద్దలకు న్యాయస్థానం నోటీసులు జారీచేయడం శుభపరిణామమన్నారు. న్యాయస్థానం ఇప్పటికే 60 సార్లకుపైగా ప్రభుత్వాన్ని తప్పుపట్టిందన్న దీపక్‌రెడ్డి...,ఇదే తీరు కొనసాగితే రాజ్యాంగసంక్షోభం ఏర్పడి ప్రభుత్వం భర్తరఫ్ కాక తప్పదని అభిప్రాయపడ్డారు.
'ప్రభుత్వం చేసే తప్పులపై మరిన్ని కేసులు వేసేందుకు సిద్ధంగా ఉన్నాం'
సెలెక్ట్ కమిటీ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడినందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించామని తెదేపా ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి స్పష్టంచేశారు. ప్రభుత్వం చేసే తప్పులపై మరిన్ని కేసులు వేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
'ప్రభుత్వం చేసే తప్పులపై మరిన్ని కేసులు వేసేందుకు సిద్ధంగా ఉన్నాం'