ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమిత్​షాకు తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న లేఖ - కేంద్ర హోమంత్రి అమిత్ షాకు ఎమ్మెల్సీ బుద్ధా లేఖ

రాష్ట్రంలో శాంతి భద్రతలకు చర్యలు తీసుకోవాలని కోరుతూ..కేంద్ర హోమంత్రి అమిత్ షాకు తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న బహిరంగ లేఖ రాశారు. వైకాపా అధికారంలోకి రాగానే ప్రతిపక్ష నేతలకు భద్రత లేకుండా పోయిందన్నారు.

బహిరంగలేఖ
బహిరంగలేఖ

By

Published : Mar 7, 2020, 9:04 PM IST

కేంద్ర హోమంత్రి అమిత్ షాకు ఎమ్మెల్సీ బుద్దా లేఖ !

ఏపీలో ప్రతిపక్షనేతలకు భద్రత లేకుడా పోయిందని.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకునేలా ముఖ్యమంత్రిని ఆదేశించాలని కోరుతూ.. కేంద్ర హోమంత్రి అమిత్​షాకు తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న లేఖ రాశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక చంద్రబాబుతో పాటు, మాజీ మంత్రి లోకేశ్​కు భద్రతను కుదించారన్నారు. దానికి తోడు రాష్ట్రంలో పర్యటనలకు వెళ్లినప్పుడు వైకాపా కార్యకర్తలు అడ్డుపడుతూ.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని వాపోయారు. ప్రతిపక్షనేతల పర్యటనలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు వైకాపా నేతలు అడ్డుకుంటున్నా... నిరోధించకపోవటం పలు అనుమానాలకు దారి తీస్తుందన్నారు.

చంద్రబాబుపై దాడే ఉదాహరణ

ప్రతిపక్షనేతల దౌర్జన్యం, దాడులు మితిమీరిపోవటానికి విశాఖలో చంద్రబాబుపై జరిగిన దాడే ఉదాహరణ అని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తెలిపారు. జాతీయస్థాయి నాయకుడైన చంద్రబాబుకే ఈ పరిస్థితి ఉదంటే.. ఏపీలో వైకాపా దురాగాతాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు.

భద్రతపై చర్యలు తీసుకోండి

వైకాపా అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలు నిరోధించడానికి, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకునేలా ఆదేశించాలని అమిత్ షాను కోరారు. చంద్రబాబు, లోకేశ్​తోపాటు, తెదేపా మాజీ ఎంపీలు, శాసనసభ్యుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వానికి తగు సూచనలు చేయాలని విన్నవించారు.

ఇదీ చదవండి:

'బీసీలకు చట్టపరంగా వచ్చిన రిజర్వేషన్లు ఎలా తగ్గిస్తారు'

ABOUT THE AUTHOR

...view details