ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

BTech Ravi: 'ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే యురేనియం టెయిల్ పాండ్ గట్టుకు కోత' - యురేనియం టెయిల్ పాండ్ విషయంలో వైకాపాపై తెదేపా నేత బీటెక్ రవి ఆగ్రహం

వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే.. కడప జిల్లాలోని తుమ్మలపల్లి యురేనియం టెయిల్ పాండ్ కట్ట తెగిపోయిందని..తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి మండిపడ్డారు. టెయిల్ పాండ్ రక్షణకు సంబంధించిన పీసీబీ నోటీసులను పెడచెవిన పెట్టారని ఆరోపణలు చేశారు.

mlc b.tech ravi fires on ycp govt over uranium tail pond in kadapa
'ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే యురేనియం టెయిల్ పాండ్ కట్టతెగిపోయింది'

By

Published : Sep 4, 2021, 9:07 PM IST


ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే.. పులివెందుల నియోజకవర్గంలోని తుమ్మలపల్లి యురేనియం టెయిల్ పాండ్ కట్ట తెగిపోయిందని.. తెదేపా ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి(బీటెక్ రవి) ధ్వజమెత్తారు.

"టెయిల్ పాండ్ రక్షణకు సంబంధించిన పీసీబీ నోటీసులను పెడచెవిన పెట్టారు. నాడు వైఎస్, నేడు జగన్ రెడ్డిలు 7గ్రామాల ప్రజల జీవితాలను అంథకారంగా మార్చారు. యురేనియం వ్యర్థాలతో భూగర్భాలు కలుషితమవుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నా.. నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. జగన్ నిర్లక్ష్యం వల్లే 4కిలోమీటర్ల పరిధిలో వేలాది ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. ప్రజల ప్రాణాల ఫణంగా పెడుతూ.. కేసుల మాఫీ కోసం కర్మాగారాన్ని కొనసాగించారు. నష్టపోయిన రైతులకు ప్రభత్వం తక్షణమే పరిహారం చెల్లించటంతో పాటు గిడ్డంగివారిపల్లె ఎత్తిపోతల పనులు వెంటనే ప్రారంభించి ప్రజలకు రక్షిత మంచినీరు సరఫరా చేయాలి. లేదంటే తెదేపా బాధితుల పక్షాన పోరాడుతుంది."

ABOUT THE AUTHOR

...view details