కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ప్రకటనలు విశాఖ ఉద్యమం దృష్టి మళ్లించేందుకేనని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపించారు. సొంత జిల్లాపై నిజంగా ప్రేమ ఉంటే దివాలా తీసిన కంపెనీతో ఒప్పందాలు చేసుకోరని అన్నారు. గతేడాది నవంబర్‌లో లిబర్టీ సంస్థతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల్ని మభ్యపెట్టే రాజకీయాలు మాని, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు దిశగా చొరవ చూపాలని హితవు పలికారు. లేకుంటే విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు.
'విశాఖ నుంచి దృష్టి మళ్లించేందుకే తెరపైకి కడప ఉక్కు కర్మాగారం' - mlc btech ravi
విశాఖ నుంచి దృష్టి మళ్లించేందుకే కడప ఉక్కు కర్మాగారం తెరపైకి తెచ్చారని వైకాపా ప్రభుత్వంపై తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపించారు. మభ్యపెట్టే మాటలు మాని కడపలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు చొరవ చూపాలని హితవు పలికారు.
విశాఖ నుంచి దృష్టి మళ్లించేందుకే కడప ఉక్కు కర్మాగారం