తెదేపా నేతలు పార్టీ మారడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వల్లభనేని వంశీకి ఎంపీగా, ఎమ్మెల్యేగా చంద్రబాబు అవకాశం ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. వంశీకి పార్టీలో ఏం అగౌరవం జరిగిందో గుండెలమీద చెయ్యేసుకుని చెప్పగలరా అని ప్రశ్నించారు. అవినాష్‌కు తెలుగు యువత అధ్యక్షుడిగా పదవి ఇచ్చి... ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే, లోకేష్ మీద అవాకులు... చవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
'ఆస్తులు కాపాడుకునేందుకే పార్టీ మారుతున్నారు' - వల్లభనేని వంశీపై ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు విమర్శలు న్యూస్
కొంతమంది ఆస్తులు కాపాడుకోవడానికే పార్టీ మారుతున్నారని... తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆరోపించారు. అవకాశమిచ్చిన వారిపై ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
mlc bachula arjunudu on ycp govt policies