'స్థానిక సంస్థల ప్రతినిధుల పట్ల ఎందుకంత కక్ష' - ఎమ్మెల్సీ బాబురాజేంద్రప్రసాద్ వార్తలు
.
mlc-babu-rajendra-prasad
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రతినిధుల పట్ల కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని... ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల విడుదల విషయంలో జాప్యం చేస్తుందన్నారు. కేంద్రం విడుదల చేసిన 1800 కోట్ల రూపాయల మొత్తాన్ని పనులు చేసిన వారికి చెల్లించట్లేదని ఆరోపించారు. ఈ డబ్బును రాష్ట్ర ప్రభుత్వం తమ సొంత పథకాలకు వినియోగిస్తోందని ధ్వజమెత్తారు.