ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఇసుకను లగ్జరీ చేసి నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారు' - 'ఇసుక మాఫియా వస్తే గానీ ప్రభుత్వానికి అర్థం కాలేదు'

ఇసుక మాఫియా వస్తే గాని జగన్ ప్రభుత్వానికి వాస్తవాలు అర్థం కాలేదా అని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు నిలదీశారు. రాష్ట్రంలో ఇసుకను లగ్జరీ చేసి లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారని విమర్శించారు.

'ఇసుక మాఫియా వస్తే గానీ ప్రభుత్వానికి అర్థం కాలేదు'
'ఇసుక మాఫియా వస్తే గానీ ప్రభుత్వానికి అర్థం కాలేదు'

By

Published : Jun 28, 2020, 10:19 PM IST

రాష్ట్రంలో ఇసుకను లగ్జరీ చేసి లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారని తెదేపా ఎమ్మెల్సీ అశోక్​బాబు విమర్శించారు. "మార్చి 2019లో జగన్ ఇసుకలో అవినీతి అన్నారు. జూన్ 2019 నుంచి ఇసుక లేదన్నారు. తరువాత వరద లొచ్చాయన్నారు. ఇసుకను ఆన్​లైన్ అమ్ముతామని చెప్పి ఆఫ్​లైన్​లో అమ్మారు. ఇసుక మాఫియా వస్తే గాని వాస్తవాలు అర్థం కాలేదు. ఇప్పుడు ట్రాక్టర్​ మీద ఇసుక ఉచితమంటున్నారు." అని అశోక్ బాబు ట్విటర్ వేదికగా వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details