కరోనాతో సహజీవనం చేయాలన్న ముఖ్యమంత్రి అసెంబ్లీ సమావేశాలు రెండు రోజులు మాత్రమే ఎందుకు పెట్టారో సమాధానం చెప్పాలని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వానిక బడ్జెట్ కంటే వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులే ముఖ్యమని మండిపడ్డారు.
'వైకాపా ప్రభుత్వానికి బడ్జెట్ కంటే ఆ రెండు బిల్లులే ముఖ్యం' - 'వైకాపా ప్రభుత్వానికి బడ్జెట్ కన్నా ఆ రెండు బిల్లులే ముఖ్యం'
వైకాపా ప్రభుత్వానిక బడ్జట్ కంటే వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులే ముఖ్యమని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. శాసనమండలిలో వైకాపా మంత్రులు ఇష్టారీతిగా ప్రవర్తించారని...ఇలాంటి వాళ్లు మంత్రులుగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నామని ఆక్షేపించారు.
'వైకాపా ప్రభుత్వానికి బడ్జెట్ కన్నా ఆ రెండు బిల్లులే ముఖ్యం'
మండలిలో మంత్రులు ప్యాంటు జిప్పులు తీసి చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి వాళ్లు మంత్రులుగా ఉన్నందుకు తాము సిగ్గుపడుతున్నామని ఆక్షేపించారు. లోకేశ్‌పై దాడి చేయటానికి మంత్రి ప్రయత్నించారని ఆరోపించారు. వైకాపా మంత్రులకు ధైర్యం ఉంటే వీడియో ఫుటేజి ప్రజల ముందు పెట్టాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు.