ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కరెంట్ చార్జీల పెంపు దారుణమైన చర్య' - current bills news

కరెంట్ చార్జీల పెంపు దారుణమైన చర్యని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు మండిపడ్డారు. నిరంకుశంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు షాక్ ఇస్తారని హెచ్చరించారు.

'కరెంట్ చార్జీల పెంపు దారుణమైన చర్య'
'కరెంట్ చార్జీల పెంపు దారుణమైన చర్య'

By

Published : May 21, 2020, 11:31 PM IST

కరెంట్ చార్జీల పెంపు దారుణమైన చర్యని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు విమర్శించారు. కరెంట్ చార్జీల పెంపుపై ప్రజల ఆవేదన తెలిపేందుకే తెదేపా నిరసన అని స్పష్టం చేశారు. చౌకగా కరెంట్ కొంటున్నామని ప్రగల్బాలు పలికి ఇప్పుడు ధరలెలా పెంచుతారని నిలదీశారు. నిరంకుశంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు షాక్ ఇస్తారని హెచ్చరించారు. కరోనా కష్టకాలంలో మూడు నెలల కరెంట్ బిల్లులు రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. గత శ్లాబులను పునరుద్ధరించాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details