ప్రభుత్వం తమకు అవసరమైన వారికి అర్థరాత్రైనా జీతాలిస్తూ.. జీతాలడిగిన కిందిస్థాయి ఉద్యోగులపై తప్పుడు కేసులు పెడుతోందని ఎమ్మెల్సీ అశోక్ బాబు ధ్వజమెత్తారు. 5 నెలలుగా జీతాలు అందక మున్సిపల్ ఉద్యోగులు వేతనాలు అడిగితే అక్రమ కేసులు పెట్టారని దుయ్యబట్టారు. ఆర్థికంగా ప్రభుత్వం పతనమైందనటానికి..జీతాలడిగిన గుంటూరు జిల్లాలోని మంగళగిరి మున్సిపల్ సిబ్బందిని అరెస్టు చేయటమే ఓ ఉదాహరణగా పేర్కొనవచ్చన్నారు. వారిపై పెట్టింది తప్పుడు కేసులు అయినందువల్లే వెంటనే బెయిల్పై బయటకు వచ్చారన్నారు. కిందస్థాయి పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం వేతనాలు ఆపి, మున్సిపల్ కమిషనర్లు, ఇతర సిబ్బందికి జీతాలిచ్చుకున్నారని విమర్శించారు. కార్మికులను ఆదుకునేందుకు తెదేపా అందిస్తున్న ఆర్థిక సాయం తీసుకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు.
'జీతాలడిగిన కింది స్థాయి ఉద్యోగులపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోంది' - ఎమ్మెల్సీ అశోక్ బాబు తాజా సమాచారం
జీతాలడిగిన కింది స్థాయి ఉద్యోగులపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు. ప్రభుత్వానికి అవసరమైన వారికైతే అర్ధరాత్రి అయిన జీతాలిస్తుందని ఆరోపించారు. కిందస్థాయి పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు నిలిపేసి, మున్సిపల్ కమిషనర్లు, ఇతర సిబ్బందికి జీతాలిచ్చుకున్నారని విమర్శించారు.
ఎమ్మెల్సీ అశోక్ బాబు
" అప్పు ఎంత దొరికితే అంత జీతాలకు సర్దుబాటు చేసే పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ఉద్యోగులకు ఇంతవరకు పీఆర్సీ ఇవ్వకపోగా, డీఏలపై ఇచ్చిన ఉత్తర్వుల్లో స్పష్టత కొరవడింది. 2018, 2019నాటి డీఏల కోసం 2022వరకు ఆగాల్సి వస్తే మిగిలిన 4డీఏలు ఎప్పుడిస్తారు. ఒక్కో ఉద్యోగికి రూ.40వేల నుంచి రూ.1.15లక్షల ప్రయోజనాలను ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది". -ఎమ్మెల్సీ అశోక్ బాబు
ఇదీ చదవండి