ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఏకగ్రీవాలపై ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో ప్రజల్లో చైతన్యం' - ashok babu on Panchayat Poll nominations

గతంలో ఏకగ్రీవాల పేరుతో ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో ప్రజల్లో చాలావరకు చైతన్యం వచ్చిందని ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. వైకాపా దౌర్జన్యాలతో ఏకగ్రీవాలు అయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ప్రాంతాల్లో తెదేపా సానుభూతిపరులు పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు.

ashok babu on Panchayati elections
గతంలో ఏకగ్రీవాలపై ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో ప్రజల్లో చైతన్యం

By

Published : Feb 1, 2021, 8:26 PM IST

వైకాపా దౌర్జన్యాలతో 85శాతం వరకు ఏకగ్రీవాలు అయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ప్రాంతాల్లో తెదేపా సానుభూతిపరులు పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేశారని ఎమ్మెల్సీ అశోక్ బాబు వెల్లడించారు. ఒక్కో పంచాయతీలో 6 మంది వరకు నామినేషన్లు వేశారన్నారు. ఆనాడు ఏకగ్రీవాల పేరుతో ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో ప్రజల్లో చాలావరకు చైతన్యం వచ్చిందన్నారు.

సర్పంచుల పాలన ప్రారంభమైతే 14వ, 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం వాడుకునే అవకాశం ఉండదనే ప్రస్తుత పాలకులు ఈ ఏకగ్రీవాలను తెరపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు. నిధులను సక్రమంగా వినియోగిస్తే చాలావరకు పల్లెలు బాగుపడతాయని.. మిగిలిన దశల్లోనూ ప్రభుత్వ దుశ్చర్యలను నిలువరించాలన్నారు. ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థులు ధైర్యంగా నామినేషన్లు వేయాలని కోరారు.


ఇదీ చూడండి:ఆ సభలే.. పల్లెలకు కీలకం

ABOUT THE AUTHOR

...view details