ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఏపీఎన్జీవో సమావేశానికి సీఎం వస్తే... రూల్స్​కు వ్యతిరేకమా?'

ఏపీఎన్జీవో సమావేశానికి సీఎం వస్తే.. అది రూల్స్​కు వ్యతిరేకం ఎలా అవుతుందని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు ప్రశ్నించారు. దీనిపై వెంటనే ఉద్యోగసంఘాలు స్పందించాలన్నారు. నోటీసులు ఇచ్చిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

mlc ashok babu
'ఏపీఎన్జీవో సమావేశానికి సీఎం వస్తే...రూల్స్ కు వ్యతిరేకమా?'

By

Published : Feb 23, 2020, 6:15 PM IST

'ఏపీఎన్జీవో సమావేశానికి సీఎం వస్తే...రూల్స్ కు వ్యతిరేకమా?'

ఒక ముఖ్యమంత్రి ఏపీఎన్జీవో సమావేశానికి వస్తే అది రూల్స్​కు వ్యతిరేకం ఎలా అవుతుందని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు ప్రశ్నించారు. 1961 నుంచి ఏపీ ఎన్జీవో సంస్థ ఉందని... ఎవరో ఒక వ్యక్తి ఫిర్యాదు ఇచ్చారని నోటీసు ఇవ్వడం సరికాదన్నారు. కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఇది ఉద్యోగ సంఘాల ప్రతిష్టను దిగజార్చటమేనన్నారు. దీనిపై వెంటనే ఉద్యోగ సంఘాలు స్పందించాలని కోరారు. నోటీసులు జారీ చేసిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అశోక్ బాబు డిమాండ్‌ చేశారు.

ఇవీ చూడండి-'వర్సిటీ భూముల కబ్జాకు వైకాపా కుట్ర'

ABOUT THE AUTHOR

...view details