ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం జగన్​కు.. ఈసారి వారి నుంచి రిటర్న్ గిప్ట్ తప్పదు: ఎమ్మెల్సీ అశోక్ బాబు - విద్యావ్యవస్థపై ఎమ్మెల్సీ అశోక్ బాబు కామెంట్స్

MLC Ashok Babu on CM Jagan: ముఖ్యమంత్రి జగన్​కు ఉద్యోగుల నుంచి ఈసారి కచ్ఛితంగా రిటర్న్​ గిప్ట్ ఉంటుందని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆయన మండిపడ్డారు. పీఆర్​సీపై ఉద్యోగ సంఘాలు చేసిన ఉద్యమం ముఖ్యమంత్రికి నచ్చలేదన్న అశోక్ బాబు.. దాన్ని దృష్టిలో పెట్టుకునే టీచర్లను వేధింపులకు గురి చేస్తున్నారన్నారు.

ఎమ్మెల్సీ అశోక్ బాబు
ఎమ్మెల్సీ అశోక్ బాబు

By

Published : Jul 23, 2022, 3:26 PM IST

MLC Ashokbabu about Employees: రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ తరువాత నాశనమైన వ్యవస్థ.. విద్యా వ్యవస్థేనని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉపాధ్యాయులపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్​కు ఉద్యోగుల నుంచి ఈసారి కచ్ఛితంగా రిటర్న్​ గిప్ట్ ఉంటుందని అన్నారు. నేషనలైజేషన్ ఆఫ్ స్కూల్స్ పేరుతో ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు తప్పుపడుతున్నారని చెప్పారు. ఇప్పటికే పాఠశాలల వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనలు చేస్తున్నారని గుర్తు చేశారు.

విలీన ప్రతిపాదన వల్ల కొన్ని వందల పాఠశాలలు మూతపడతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్​సీపై ఉద్యోగ సంఘాలు చేసిన ఉద్యమం ముఖ్యమంత్రికి నచ్చలేదన్న అశోక్ బాబు..దాన్ని దృష్టిలో పెట్టుకునే టీచర్లను వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details