విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కండ్రిక ప్రాంతంలోని పలు కాలనీల్లో అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నెల 25న ప్రభుత్వం పెద్దఎత్తున పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమం చేపడుతుండటం రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయంగా మిగిలిపోతుందని ఆయన అన్నారు. నగరానికి దూరంగా పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తున్నారని.. ప్రతిపక్షాల ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
'పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయం' - విజయవాడ తాజా వార్తలు
పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయంగా మిగిలిపోతుందని ఎమ్మెల్యే, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. దీనిపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కండ్రిక ప్రాంతంలోని పలు కాలనీల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు.
!['పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయం' mla malladi vishnu on plots distribution](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9977766-875-9977766-1608716154608.jpg)
ఎమ్మెల్యే మల్లాది విష్ణు
గతంలో పేదల కోసం సింగ్ నగర్, పాయకాపురం ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయించగా.. నగరీకరణలో భాగంగా ఇప్పుడు ఈ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాయన్నారు. నగరానికి దూరంలో ఉన్న ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: మమతాను చూసైనా జగన్ కళ్లు తెరవాలి: సోమిరెడ్డి