పేదలకు.. ముఖ్యమంత్రి జగన్ ఇళ్లు నిర్మిస్తుంటే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం ఆరోపణలు చేస్తున్నారంటూ కృష్ణా జిల్లా పెడన వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్ విమర్శించారు. కుల, మతాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా.. ప్రజల గుండెల్లో జగన్ ముద్రను ఒక్క శాతం కూడా తగ్గించలేరన్నారు. జగన్ హయాంలోనే పోలవరం పూర్తవుతుందని చెప్పారు. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో.. కుప్పంలో కూడా ఓడిపోతారని జోస్యం చేప్పారు. అభివృద్ధి జరుగుతోంది కాబట్టే.. నీతి ఆయోగ్ ర్యాంకుల్లో ఏపీ మూడో స్థానంలో నిలిచిందన్నారు.
జగన్ ఇళ్లు నిర్మిస్తుంటే.. చంద్రబాబు ఆరోపణలు చేయడం దారుణం: జోగి రమేశ్ - పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ చంద్రబాబుపై విమర్శాస్త్రాలు
ముఖ్యమంత్రి జగన్ పేదలకు ఇళ్లు నిర్మిస్తుంటే.. చంద్రబాబు ఇళ్ల నిర్మాణాలపై ఆరోపణలు చేయడం దారుణమని వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్ (Jogi Ramesh) ధ్వజమెత్తారు. చంద్రబాబు(Chandrababu) ఎన్ని కుట్రలు చేసినా.. ప్రజల గుండెల్లో జగన్(Jagan) ముద్రను ఒక్క శాతం కూడా తగ్గించలేరన్నారు.
ysrcp mla jogi ramesh