ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'జగన్​కు అమ్ముడుపోయి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు' - 'జగన్​కు అమ్ముడుపోయి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు'

జగన్ బూట్లు నాకేందుకే.. కన్నతల్లి లాంటి పార్టీపై, చంద్రబాబుపై వల్లభనేని వంశీ, మద్దాలి గిరి విమర్శలు చేస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి మండిపడ్డారు. జగన్​కు అమ్ముడుపోయి ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు.

'జగన్​కు అమ్ముడుపోయి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు'
'జగన్​కు అమ్ముడుపోయి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు'

By

Published : Jun 19, 2020, 6:51 PM IST

Updated : Jun 19, 2020, 7:24 PM IST

తెలుగుదేశం పార్టీ గుర్తుపై గెలిచిన వల్లభనేని వంశీ, మద్దాలి గిరి నేడు తల్లి పాలు తాగి ద్రోహం చేసిన విధంగా వ్యవహరిస్తున్నారని కొండెపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శించారు. జగన్ బూట్లు నాకేందుకే కన్నతల్లి లాంటి పార్టీపై, చంద్రబాబు పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్​కు అమ్ముడుపోయి ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. రాష్ట్రంలో జగన్ విధ్వంస విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే రాజ్యసభ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిని నిలబెట్టామని స్పష్టం చేశారు.

ఎస్సీ సబ్ ప్లాన్​కు చంద్రబాబు 9 వేల కోట్లు ఖర్చు చేస్తే.. జగన్ మాత్రం కేవలం 4,378 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారన్నారు. రాష్టంలో మైన్, వైన్, శాండ్, ల్యాండ్ కుంభకోణాలతో వేల కోట్లు దోచుకుతింటున్న జగన్మోహన్ రెడ్డికి మద్దాలి గిరి కొమ్ముకాయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. చంద్రబాబు, లోకేశ్​ గురించి మాట్లాడే స్థాయి వారికి లేదని పిచ్చి ప్రేలాపనలు చేస్తున్న వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్ కు నియోజకవర్గ ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వెల్లడించారు.

Last Updated : Jun 19, 2020, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details