ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రఘురామ అరెస్ట్​తో చంద్రబాబుకు భయం పట్టుకుంది: అంబటి - రఘురామరాజు అరెస్ట్​పై ఎమ్మెల్యే అంబటి స్పందన

చంద్రబాబు, లోకేశ్‌, వారి అనుచరులైన టీవీ ఛానళ్లకు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా డ్రామా నడిపించడం అలవాటుగా మారిందని ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్​తో.. ఆయనతో ఇన్నాళ్లు నడిపిన అపవిత్ర బంధం బయటపడుతుందన్న భయం చంద్రబాబులో మొదలైందన్నారు.

mla ambati rambabu
ఎమ్మెల్యే అంబటి రాంబాబు

By

Published : May 15, 2021, 10:45 PM IST

ఎంపీ రఘురామకృష్ణరాజు ఏ విధంగా రాజద్రోహానికి పాల్పడ్డారో వివరిస్తూ.. 46కి పైగా వీడియోలను కోర్టుకు సీఐడీ సమర్పించిందని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు వివరించారు. రచ్చబండ పేరుమీద రెండు గంటల పాటు నోటికి వచ్చిన బూతులు తిట్టడంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పచ్చి అబద్ధాలతో డ్రామా నడిపారన్నారు. చంద్రబాబు, లోకేశ్‌, వారి అనుచరులైన టీవీ ఛానళ్లకు.. ఈ తరహా చర్యలు అలవాటుగా మారాయని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో విమర్శను ఎవరైనా ఆహ్వానిస్తారే కానీ సీరియస్‌గా తీసుకోరని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:ఆ రాష్ట్రంలో ప్రభుత్వ అధీనంలోకి ప్రైవేటు ఆస్పత్రులు

రఘురామకృష్ణరాజు అరెస్ట్​తో ఆయన వెనక ఉండి కథ నడిపించిన చంద్రబాబుకు.. గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లైందని అంబటి ఎద్దేవాచేశారు. తనకూ ఇదేగతి పడుతుందన్న భయం ఒకపక్క, రఘురామకృష్ణరాజుతో ఇన్నాళ్లు నడిపిన అపవిత్ర బంధం బయటపడుతుందన్న ఆందోళన మరోపక్క.. చంద్రబాబును వెంటాడుతోందని దుయ్యబట్టారు. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు.. రఘురామకృష్ణరాజుపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం తీవ్ర నేరం అంటూ చంద్రబాబు ప్రకటన చేశారని మండిపడ్డారు. తాను సైతం దొరికిపోబోతున్నానన్న భావం ఆయన భయంలోనే కనిపిస్తోందన్నారు. పురంధేశ్వరి వంటి భాజపా నేతలు.. తెదేపా అధినేత వాదనకు మద్దతు పలకడం సిగ్గుచేటని విమర్శించారు. రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు రాజద్రోహం అవునో, కాదో చెప్పాల్సింది న్యాయస్థానాలే తప్ప చంద్రబాబు కాదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

రఘురామను గాయపరిచిన అధికారులపై చర్యలు తీసుకోవాలి: చంద్రబాబు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details