మిజోరాం గవర్నర్(mizoram governer) కంభంపాటి హరిబాబు(kambampati haribabu) విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి(vijayawada international airport) చేరుకున్నారు. గవర్నర్ హరిబాబుకు కలెక్టర్ నివాస్, సీపీ శ్రీనివాస్, ఇతర అధికారులు ఘనస్వాగతం పలికారు.
అనంతరం.. రోడ్డు మార్గంలో విజయవాడలోని తన నివాసానికి బయలుదేరి వెళ్లారు. ఇవాళ్టి నుంచి ఈనెల 31 వరకు హరిబాబు రాష్ట్రంలో పర్యటించనున్నారు. రేపు ప్రకాశం జిల్లా తిమ్మసముద్రం, గుంటూరు జిల్లా నిడుబ్రోలులోని ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈనెల 31న విజయవాడ నుంచి విశాఖపట్నం బయలుదేరి వెళ్తారు.