విజయవాడ భవానీ కథ సుఖాంతమైంది. 15 ఏళ్ల కిందట హైదరాబాద్లో అదృశ్యమైన భవానీ... ఫేస్బుక్ ద్వారా కన్న తల్లిదండ్రులను ఇవాళే కలిసింది. చీపురుపల్లి నుంచి భవానీ.. రక్త సంబంధీకులు వచ్చారు. విజయవాడ పటమటలంకకు చెందిన జయమ్మ భవానీని కన్నకూతుళ్లతో సమానంగా పెంచింది. ఇరు కుటుంబాలతో పోలీసులు మాట్లాడి... ఆధారాలను పరిశీలించారు. భవానీకి నచ్చిన వారి వద్ద ఉండొచ్చని పోలీసులు చెప్పారు. అయితే... భవానీని పెంచిన తల్లి జయమ్మ మాత్రం డీఎన్ఏ పరీక్ష చేసి తల్లిదండ్రులకు అప్పగించాలని పోలీసులను కోరుతోంది. కన్నతల్లితోపాటు పెంచిన అమ్మతో ఉంటానని భవానీ అంటోంది. రెండు కుటుంబాలు ఏమనుకుంటున్నాయో... మా ప్రతినిధి అందిస్తారు.
కన్నప్రేమ కావాలి... పెంచిన ఆప్యాయత ఉండాలి..! - విజయవాడ భవానీ కథ సుఖాంతం న్యూస్
ఏళ్లుగా.. కన్నవారికి దూరంగా ఉన్న భవానీ కథ సుఖాంతమైంది. వారిని ఫేస్బుక్ కలిపింది. పేగుబంధంతోపాటు పెంచిన బంధం.. తనతోనే ఉండాలని భవానీ కోరుకుంటోంది.
![కన్నప్రేమ కావాలి... పెంచిన ఆప్యాయత ఉండాలి..! missing bhavani story end happily](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5309132-4-5309132-1575809024869.jpg)
missing bhavani story end happily
Last Updated : Dec 8, 2019, 6:15 PM IST