తనపై ఒక యువకుడు, అతని స్నేహితులు అత్యాచారం చేశారంటూ ఓ బాలిక విజయవాడ భవానీపురం పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తనపై దౌర్జన్యానికి పాల్పడ్డాడంటూ ఆరోపించింది. దీనిపై సీపీ ద్వారకా తిరుమలరావు వివరాలు తెలియజేశారు. భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితురాలు తన తల్లితో నివాసముంటూ పని చేసుకుని జీవిస్తున్నారు. ఈ క్రమంలో తనతో కలిసి పని చేసే ఓ యువకుడితో బాధితురాలికి పరిచయం ఏర్పడింది. వివాహం చేసుకుంటానని చెప్పి గత సెప్టెంబర్ నెలలో తీసుకెళ్లాడని.. యువకుడితో పాటు అతడి మిత్రులూ తనపై అత్యాచారం చేశారని బాధితురాలు తెలిపినట్లు సీపీ వివరించారు. ఈ కేసులో మొత్తం ఏడుగురిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని.. నలుగురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
బాలికపై అత్యాచారం.. ఏడుగురి అరెస్టు - విజయవాడలో మైనర్ బాలికపై అత్యాచారం
బాలికపై అత్యాచారం చేసిన ఏడుగురి నిందితులపై విజయవాడ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరుపుతున్నామని తెలిపారు.
![బాలికపై అత్యాచారం.. ఏడుగురి అరెస్టు minor girl raped by seven members in vijayawada city](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5267280-375-5267280-1575459620176.jpg)
విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు
Last Updated : Dec 5, 2019, 8:17 AM IST