ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

FINANCE DEPARTMENT: జీతాలు, పెన్షన్ బిల్లుల ప్రక్రియపై ఆర్థికశాఖ సర్క్యులర్ - Ministry of Finance has issued a circular

FINANCE DEPARTMENT: జీతాలు, పెన్షన్ బిల్లుల ప్రక్రియపై ఆర్థికశాఖ మరోసారి సర్క్యులర్ జారీ చేసింది. కొత్త పేస్కేళ్ల ప్రకారమే జీతాలు, పెన్షన్ బిల్లులను ప్రాసెస్ చేయాలని ఆదేశించింది. సర్క్యులర్ ప్రకారం నిర్దేశిత గడువులోగా జీతాలు, పెన్షన్ బిల్లుల ప్రక్రియ చేపట్టకుంటే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించింది.

జీతాలు, పెన్షన్ బిల్లుల ప్రక్రియపై ఆర్థికశాఖ సర్క్యులర్
జీతాలు, పెన్షన్ బిల్లుల ప్రక్రియపై ఆర్థికశాఖ సర్క్యులర్

By

Published : Jan 27, 2022, 3:18 PM IST

FINANCE DEPARTMENT: జీతాలు, పెన్షన్ బిల్లుల ప్రక్రియపై ఆర్థికశాఖ మరోసారి సర్క్యులర్ జారీ చేసింది. కొత్త పేస్కేళ్ల ప్రకారమే జీతాలు, పెన్షన్ బిల్లులను ప్రాసెస్ చేయాలని ఆదేశించింది. సర్క్యులర్ ప్రకారం నిర్దేశిత గడువులోగా జీతాలు, పెన్షన్ బిల్లుల ప్రక్రియ చేపట్టకుంటే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించింది. ఆదేశాలు ఉల్లఘించే డీడీవోలు, పీఏవోలు, ట్రెజరీ అధికారులపై చర్యలు తప్పవని స్పష్టంచేసింది. జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేసే అంశంపై గడువు నిర్దేశిస్తూ సర్క్యులర్ విడుదల చేసింది.

ఇవాళ సాయంత్రంలోగా బిల్లులను అప్ లోడ్ చేయాలని డీడీవోలకు నిర్దేశించింది. అప్​లోడ్ చేసిన బిల్లులను రేపటిలోగా ప్రాసెస్ చేయాల్సిందిగా పే అండ్ అకౌంట్స్ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఫిబ్రవరి 1వ తేదీ నాటికి జీతాలు జమయ్యేలా చూడాలని ట్రెజరీ అధికారులకు ఆర్థిక శాఖ సర్క్యులర్ లో స్పష్టంచేసింది. ఈ ప్రక్రియను గడువులోగా పూర్తిచేసేలా చూడాలని కార్యదర్శులు, హెచ్​డీవో, కలెక్టర్లకు ఆర్థికశాఖ ఆదేశాలు జారీ చేసింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details