ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అమ్మవారి ఆశీర్వాదం అందరిపై ఉండాలి' - Home Minister Sucharitha visit Durga Temple news

బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఎనిమిదో రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు శ్రీదుర్గాదేవి గాను, మధ్యాహ్నం రెండు గంటల నుంచి మహిషాసురమర్థని అవతారంలో భక్తులకు కనకదుర్గమ్మ అమ్మవారు దర్శనమిచ్చారు. పలువురు వీఐపీలు, భవానీ దీక్షాపరులు, భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

Ministers visit Durga Temple in Vijayawada
'అమ్మవారి ఆశీర్వాదం అందరిపై ఉండాలి'

By

Published : Oct 24, 2020, 8:39 PM IST

'అమ్మవారి ఆశీర్వాదం అందరిపై ఉండాలి'

ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మను హోంమంత్రి సుచరిత, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఐఏఎస్ అధికారి కోటేశ్వరమ్మ దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఈవో, వేద పండితులు వీరికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖులు అందరికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

మహిళను ఆదిపరాశక్తిగా పూజించే సంప్రదాయం మనకు ఉందని, అమ్మవారి కృపా కటాక్షాలు ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నట్లు మంత్రులు తెలిపారు. గతంతో పోలిస్తే పరిస్థితుల ప్రభావంతో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించారని వివరించారు. కరోనా నుంచి బయటపడి అందరూ సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రతి మహిళా ఆదిపరాశక్తిగా మారి అన్యాయాలపై ధైర్యంగా ఎదిరించే స్థాయికి రావాలని ఆకాక్షించారు.

దిశ యాప్​ను ఉపయోగించుకుని భద్రత విషయంలో పోలీస్ సహాయ సహకారాలు తీసుకోవాలని కోరుకుంటున్నట్లు మంత్రులు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలయ అభివృద్ధికి రూ.70 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అమ్మవారి ఆలయం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని.. అమ్మవారి ఆశీర్వాదం తమ ప్రభుత్వంపై ఉండి మరిన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాలని కోరుకున్నట్టు చెప్పారు.

ఇదీ చదవండీ... 'జగన్​.. సామాజిక న్యాయం సంరక్షకుడిగా మారారు'

ABOUT THE AUTHOR

...view details