ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైఎస్‌ఆర్‌ చేయూత పథకంపై మంత్రుల సమీక్ష - వైఎస్‌ఆర్‌ చేయూత పథకం

వైఎస్‌ఆర్‌ చేయూత పథకంపై మంత్రులు సమీక్షించారు. రిటైల్‌ కాల్‌సెంటర్‌ పనితీరును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలించిన మంత్రులు...రిటైల్ బ్రాండ్ లోగోను ఆవిష్కరించారు.

వైఎస్‌ఆర్‌ చేయూత పథకంపై మంత్రులు సమీక్షా
వైఎస్‌ఆర్‌ చేయూత పథకంపై మంత్రులు సమీక్షా

By

Published : Nov 5, 2020, 7:34 PM IST

రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ మహిళలకు ఆర్థికసాయం అందించే వైఎస్‌ఆర్‌ చేయూత పథకంపై మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రులు అంజాద్‌ బాషా, పుష్పశ్రీవాణి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పంచాయితీరాజ్‌ శాఖ, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. వైఎస్‌ఆర్‌ చేయూత రిటైల్‌ కాల్‌సెంటర్‌ పనితీరును వీడియో కాన్ఫరెన్సు ద్వారా మంత్రులు పరిశీలించారు. అనంతరం వైఎస్ఆర్ చేయూత రిటైల్ బ్రాండ్ లోగోను ఆవిష్కరించారు.

ప్రముఖ పాల సహకార సంస్థ అమూల్‌తో కలసి ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో మొదట విడతగా ఈ నెలలో పాల సేకరణ చేయనున్నట్లు అధికారులు మంత్రులకు వివరించారు. వీలైనంత మేరకు వైఎస్‌ఆర్‌ చేయూత లబ్ధిదారులకు అవసరమైన అన్ని కిరాణా సరుకుల సరఫరా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని మంత్రులు సూచించారు. లబ్ధిదారులతో కంపెనీలు చేసుకున్న ఒప్పందాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details