పేదల సంక్షేమం కోసమే సీఎం జగన్ కృషి చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైకాపా పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా..పార్టీ నేతలు, కార్యకర్తలు విజయవాడలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏడాది పాలనలో వైకాపా ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోతాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దేశంలోని ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా 95 శాతం హామీలను నెరవేర్చారన్నారు.
'పేదల సంక్షేమం కోసమే సీఎం జగన్ కృషి' - వైకాపా ఏడాది పాలన వార్తలు
వైకాపా పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు విజయవాడలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎం జగన్పై మంత్రులు ప్రశంసలు కురిపించారు.
ministers praises cm jagan on the ocassion of one year for ycp rule