కొవిడ్ నిబంధనలు సామాన్యులకు, ప్రతిపక్ష పార్టీలకు మాత్రమే.. తమకు కాదు అన్నట్లు వైకాపా నాయకులు, మంత్రులు విజయవాడలో పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు మద్దతుదారులతో మంత్రులు, ఎమ్మెల్యేలు నగరంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద నుంచి స్వరాజ్య మైదానం వరకు ర్యాలీ నిర్వహించారు.
భౌతిక దూరం పాటించకుండా.. మాస్కులు లేకుండా చేపట్టిన ర్యాలీ చూసిన నగరవాసులు భయాందోళనలకు గురయ్యారు. ఇటువంటి ర్యాలీ వలన కరోనా మరింత విస్తరించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు చెప్పాల్సిన మంత్రులే ఈ తరహా ర్యాలీలు నిర్వహించడం ఎంత వరకు సమంజసమని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు.