మోడల్ స్కూల్స్, ఇతర విద్యాపరమైన అంశాలపై ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సమీక్ష నిర్వహించారు. విజయవాడలోని ప్లానింగ్ బోర్డు కార్యాలయంలో సమీక్ష జరిపారు. మోడల్ స్కూల్స్లో సర్వీస్ రూల్స్, సీపీఎస్ అమలు, హెల్త్ కార్డులు తదితర అంశాలపై మంత్రులు చర్చించారు. విద్యాశాఖలో దీర్ఘకాలికంగా పరిష్కారం కాని ఆర్థిక పరమైన అంశాలపై చర్చ జరిగింది. విద్యాశాఖకు కావలసిన కేటాయింపులపై ఆర్థికశాఖ మంత్రి సానుకూలంగా స్పందించారని విద్యా శాఖ వెల్లడించింది.
విద్యాపరమైన అంశాలపై మంత్రుల సమీక్ష - minister-adhimulapu suresh-review on education
విజయవాడలో ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖకు కావలసిన కేటాయింపులపై మంత్రి బుగ్గన సానుకూలంగా స్పందించారని విద్యాశాఖ వెల్లడించింది.
విద్యాపరమైన అంశాలపై మంత్రుల సమీక్ష