నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకే నిధులు జమ అయ్యేలా వైకాపా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని మంత్రి వేణుగోపాల్ అన్నారు. బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన పొందేందుకే వారి ఖాతాల్లోకి 18,750 రూపాయల చొప్పున జమ చేశామని చెప్పారు. ప్రజల పట్ల ఆలోచించని తెదేపాకు విమర్శలు చేసే హక్కులేదని మంత్రి వ్యాఖ్యానించారు. ఎన్నికల కోసమే పసుపు - కుంకుమ పేరిట పంపకాలు చేశారని ఆరోపించారు.
'పాలనా వికేంద్రీకరణలో భాగంగానే గ్రామ, వార్డు సచివాలయాలు' - గ్రామ వార్డు సచివాలయాలపై మంత్రి వేణుగోపాల్ న్యూస్
పాలనా వికేంద్రీకరణలో భాగంగానే గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశారని బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. గతంలో జన్మభూమి లాంటి కమిటీలు క్షేత్రస్థాయిలో మోసాలకు పాల్పడ్డాయని ఆరోపించారు.
!['పాలనా వికేంద్రీకరణలో భాగంగానే గ్రామ, వార్డు సచివాలయాలు' minister venugopal about ysrcp govt](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8403387-289-8403387-1597314110595.jpg)
minister venugopal about ysrcp govt