ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పథకాలు ప్రజలకు చేరువ చేసేందుకే వాలంటీర్ వ్యవస్థ: మంత్రి వెల్లంపల్లి

By

Published : Apr 15, 2021, 4:51 PM IST

కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వాలంటీర్లు సేవ చేశారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కొనియాడారు. విజయవాడలో నిర్వహించిన వాలంటీర్ల సేవా సత్కారాల వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాలంటీర్లను ప్రశంసా పత్రాలతో సత్కరించారు.

minister vellampally on Volunteers
పథకాలు ప్రజలకు చేరువ చేసేందుకు వాలంటీర్ వ్యవస్థ

ప్రభుత్వ పథకాలు ప్రజలకు నేరుగా అందాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్ వాలంటీర్ విధానం తెచ్చారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడలో నిర్వహించిన వాలంటీర్ల సేవా సత్కారాల వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాలంటీర్లను ప్రశంసా పత్రాలతో సత్కరించారు. కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వాలంటీర్లు సేవ చేశారని మంత్రి కొనియాడారు.

ఇతర రాష్ట్రాలు మెచ్చుకునేలా వాలంటీర్ల పనితీరు ఉందని ప్రశంసించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక కుల,మత, పార్టీ బేధాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయటంలో వాలంటీర్లు వారధులుగా పనిచేస్తున్నారంటూ అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details