ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Vellampally On Bhavani Devotes: భవానీ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు: మంత్రి వెల్లంపల్లి

Vellampally On Bhavani Devotes: ఇంద్రకీలాద్రికి వచ్చే భవానీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా.. దీక్షా విరమణ ఏర్పాట్లు చేయనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. గిరి ప్రదక్షిణలు మెుదలు.. భక్తులు ఇంటికి వెళ్లేవరకు ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా చూసుకుంటామన్నారు.

భవానీ భక్తలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు
భవానీ భక్తలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు

By

Published : Dec 7, 2021, 6:09 PM IST

Updated : Dec 7, 2021, 7:00 PM IST

Minister Vellampally On Bhavani Devotes: ఇంద్రకీలాద్రికి వచ్చే భవానీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా.. దీక్షా విరమణ ఏర్పాట్లు చేయనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా మరో రెండు కేశఖండన శాలలను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. కలెక్టర్ జె. నివాస్ అధ్యక్షతన జరిగిన కో-ఆర్డినేషన్ సమావేశంలో పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి..భవానీ దీక్షల విరమణకు సంబంధించిన ఏర్పాట్లుపై అధికారులకు పలు సూచనలు చేశారు.

covid rules: గిరి ప్రదక్షణలు మెుదలు.. భక్తులు ఇంటికి వెళ్లేవరకు ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా చూసుకుంటామని వెల్లంపల్లి అన్నారు. ఈ సారి 15 లక్షల లడ్డూలు తయారు చేయిస్తున్నామన్నారు. ఆలయ పరిసరాల్లో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. దసరా సందర్భంగా విధించిన కొవిడ్ నిబంధనలనే ఈసారీ పాటిస్తామన్నారు. ట్రాఫిక్​పై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. శాటిటైజేషన్, తాగునీరు సహా పలు ఏర్పాట్లు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు అప్పగిస్తున్నట్లు కలెక్టర్ జె. నివాస్ స్పష్టం చేశారు.

ఘాట్ల పరిశీలన..

భవానీ దీక్షా విరమణకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి వెల్లంపల్లి పరిశీలించారు. కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఉన్న ఘాట్లు, జల్లు స్నానాలు చేసే ప్రాంతాలను కలెక్టర్ జె. నివాస్​తో కలిసి పరిశీలించారు. పున్నమి ఘాటు, దుర్గాఘాటు సహా మెుత్తం ఐదు ఘాట్లను దీక్షా విమరణకు కేటాయించారు. వివిధ జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి భక్తులు రానున్న నేపథ్యంలో ఎక్కడా లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి వెల్లంపల్లి ఆదేశించారు. కేశఖండన శాల వద్ద రద్దీని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

ఇదీ చదవండి: KODALI NANI IN BHADRACHALAM : భద్రాద్రి రామయ్య సేవలో మంత్రి కొడాలి నాని

Last Updated : Dec 7, 2021, 7:00 PM IST

ABOUT THE AUTHOR

...view details