కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గ నిర్దేశాలకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా భక్తులకు దుర్గమ్మవారి దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల పది నుంచి పూర్తి స్థాయిలో ఆలయాలకు భక్తులను అనుమతించనున్న క్రమంలో.... దుర్గగుడిలో ప్రయోగాత్మకంగా నిర్వహించిన ట్రయిల్ రన్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం క్యూలైన్లలో ఏర్పాట్లను పరిశీలించారు. పాలక మండలి ఛైర్మన్, ఆలయ ఈవోతో కలిసి మహా మండపం మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆలయ అధికారుల సూచన పాటించాలని కోరారు.
ఇంద్రకీలాద్రిపై ట్రయిల్ రన్ ప్రారంభం - విజయవాడ దుర్గమ్మ ఆలయం వార్తలు
ఇంద్రకీలాద్రిపై ట్రయిల్ రన్ ప్రారంభమైంది. బుధవారం నుంచి అమ్మవారిని భక్తులు దర్శించుకోవచ్చు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. భక్తులు కనీస జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
trail run in vijayawada durga temple started