మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇంట్లో విషాదం - mother dead
రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నివాసంలో విషాదం నెలకొంది. మంత్రి తల్లి వెల్లంపల్లి మహాలక్ష్మమ్మ ఇవాళ మృతి చెందారు. మంత్రి కుటుంబ సభ్యులకు సీఎం జగన్ సానుభూతి తెలిపారు.
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు మాతృ వియోగం కలిగింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతోన్న మహాలక్ష్మమ్మ(73) అనారోగ్యంతో కన్ను మూశారు. కొద్ది రోజులుగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ సాయంత్రం తుది శ్వాస విడిచారు. మహాలక్ష్మమ్మ మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతాపం తెలిపారు.ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. రేపు మధ్యాహ్నం 1 గంటకు విజయవాడ బ్రాహ్మణ వీధిలోని మంత్రి స్వగృహం నుంచి అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది