రాష్ట్రవ్యాప్తంగా దేవదాయశాఖ అధికారులతో మంత్రి శ్రీనివాసరావు విజయవాడలోని దేవాదాయశాఖ కార్యాలయంలో భేటీ అయ్యారు. భూముల పరిరక్షణ, ఆలయాల అభివృద్ధిపై వారితో చర్చించారు. ఆలయాల్లో ధూప దీప నైవేద్యాల కోసం బడ్జెట్‌లో 234 కోట్లు కేటాయించామని తెలిపారు. దీనికోసం రాష్ట్రంలోని అన్ని ఆలయాలకు 5 వేల నుంచి 10 వేలు కేటాయిస్తామని వెల్లడించారు. ఆలయ భూముల వివరాలను రిజిస్ట్రేషన్ శాఖకు పంపిస్తామనీ.. దేవదాయశాఖలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని సీఎంను కోరినట్లు వివరించారు. అర్చకులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. నవంబర్ 1 నుంచి జిల్లాలవారీగా కమిషనర్ స్థాయి అధికారుల సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.
ధూపదీప నైవేద్యాల కోసం బడ్జెట్‌లో కేటాయింపులు: శ్రీనివాసరావు - వెల్లంపల్లి శ్రీనివాసరావు రివ్యూ
తెదేపా హయాంలో కూల్చివేసిన దేవాలయాలను తిరిగి నిర్మిస్తామనీ.. వారి హయాంలో నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన భూముల లీజును సమీక్షించి వాటిని రద్దు చేస్తామని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు.
![ధూపదీప నైవేద్యాల కోసం బడ్జెట్‌లో కేటాయింపులు: శ్రీనివాసరావు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4794990-110-4794990-1571408177265.jpg)
దేవాదాయశాఖ మంత్రి సమీక్ష
Last Updated : Oct 28, 2019, 8:28 AM IST