ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

VELLAMPALLY: సీఎంలను విమర్శించే స్థాయి కేశినేని నానికి లేదు: వెల్లంపల్లి - విజయవాడ తాజా వార్తలు

విజయవాడలో వివిధ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఆనందయ్య కరోనా మందును దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పంపిణీ చేశారు. తమ నాయకులు చేసిన పొరపాట్ల వల్లే కేశినేని గెలిచారని అయన విమర్శించారు.

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు

By

Published : Jul 2, 2021, 1:35 PM IST

విజయవాడ వన్​టౌన్ వస్త్రలత కాంప్లెక్స్ ప్రాంగణంలో వివిధ అసోసియేషన్ల ఆధ్వర్యంలో నెల్లూరు ఆనందయ్య కరోనా మందును స్ధానిక ఎమ్మెల్యే, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పంపిణీ చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను విమర్శించే స్థాయి విజయవాడ ఎంపీ కేశినేని నానికి లేదని మండిపడ్డారు. తమ నాయకులు చేసిన పొరపాట్ల వలనే కేశినేని నాని గెలిచారనే విషయం మరిచిపోవద్దని మంత్రి వెలంపల్లి స్పష్టం చేశారు. కేంద్రం నుంచి నిధులు తేలేని ఎంపీ కేశినేని నాని చేసే విమర్శలు తాము పట్టించుకోమని వెల్లంపల్లి అన్నారు.

కేశినేని నాని ఏమన్నారంటే..!

తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం.. ఇరువురు ముఖ్యమంత్రులు జగన్‌, కేసీఆర్‌ కలిసి ఆడుతున్న నాటకమని ఇటీవల తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. ఇద్దరూ కలిసి ప్రజల్ని పిచ్చోళ్లను చేయాలనుకుంటున్నట్లు ఆక్షేపించారు.

ఇదీ చదవండి:

స్టాక్​ మార్కెట్లో లాభాలు రావాలంటే ఏం చేయాలి?

ABOUT THE AUTHOR

...view details