తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధంపై దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా దేవదాయ శాఖ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్‌ను నియమించారు. ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి.... దేవాదాయ కమిషనర్ పి.అర్జునరావు, జిల్లా ఎస్సీతో మంత్రి ఫోన్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. దేవాదాయ, పోలీస్, ఫైర్, రెవెన్యూ అధికారులతో చేపడుతున్న సహయక చర్యలపై ఆరా తీశారు. ఈ ఘటనపై కఠిన చర్యలు చేపట్టాలని, దేవాదాయ శాఖ అధికారులతో పాటు పోలీసులను ఆదేశించారు. రథం పున నిర్మాణానికి చర్యలు చేపట్టాలని దేవాదాయ కమిషనర్‌కు మంత్రి ఆదేశించారు.
అంతర్వేది ఘటనపై విచారణకు ఆదేశించిన మంత్రి వెల్లంపల్లి - తూర్పుగోదావరి జిల్లా వార్తలు
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో ఆలయ రథం దగ్ధమైన ఘటనపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
![అంతర్వేది ఘటనపై విచారణకు ఆదేశించిన మంత్రి వెల్లంపల్లి Minister Vellampalli Srinivas has ordered an inquiry into the Antarvedi incident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8699011-538-8699011-1599376847957.jpg)
మంత్రి వెల్లంపల్లి