ఆస్తి ఆధారిత పన్ను, చెత్తపై పన్ను.. ప్రజలకు భారం కావని.. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. నూతన పన్నుల విధానాన్ని.. కూలంకషంగా పరిశీలించిన తరువాతే.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురంలో స్థానిక కార్పరేటర్లతో కలిసి పర్యటించిన ఆయన.. పన్నులపై ప్రతిపక్షాలు అనవసర ఆందోళనలు చేస్తున్నాయని మండిపడ్డారు. పన్నుల విధానం అమల్లోకి వచ్చిన తరువాత.. ప్రజలే తమకు మద్దతు ప్రకటిస్తారని మంత్రి దీమా వ్యక్తం చేశారు.