తితిదే భూముల అమ్మకాల పై లేనిపోని గందరగోళం సృష్టిస్తున్నారని మంత్రి వెల్లంపల్లి అన్నారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో భూముల అమ్మకం చేయట్లేదా అని మంత్రి ప్రశ్నించారు. భక్తులు ఇచ్చిన బంగారం కరిగించి డాలర్ల రూపంలో బ్యాంకుల్లో దాస్తే తప్పేముందన్నారు. హిందూ ఆలయాలను కాపాడటాని, ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం కృషిచేస్తోంది.
మంత్రి వెల్లంపల్లి మీడియా సమావేశం ప్రభుత్వం పై దుష్ప్రచారం మానుకోవాలి
ప్రతి నియోజకవర్గంలోని దేవాలయలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని.. ప్రభుత్వంపై దుష్ప్రచారం మానుకోవాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. చిన్నచిన్న మారుమూల ప్రాంతాల్లోని ఆస్తులను గుర్తించారన్న ఆయన.. అభివృద్ధి చూడకుండా దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు.
ఇవీ చదవండి:తితిదే ఆస్తుల వేలం నిలిపివేయాలంటూ హైకోర్టులో వ్యాజ్యం